రాష్ట్రపతి చేతులమీదుగా కాసేపట్లో అల్లు అర్జున్‌కు అవార్డు.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

by Disha Web Desk 9 |
రాష్ట్రపతి చేతులమీదుగా కాసేపట్లో అల్లు అర్జున్‌కు అవార్డు.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును అందుకోవడానికి నిన్న (అక్టోబరు 16)తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఖుషీ ఖుషీగా ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు (అక్టోబరు 17)జరిగే జాతీయ అవార్డు సెర్మనీలో.. రాష్టపతి చేతుల మీదుగా బన్నీ అవార్డు అందుకోబోతున్నారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో మంది ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే..

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయిగా నటిస్తుండగా.. సునీల్, ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రల్లో అలరించనున్నారు. ఇక ఈ సినిమా 2024 ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా 3 నెలల ముందే ప్రారంభించనున్నారని గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed