‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ షోలో గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ

by Dishaweb |
‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ షోలో గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ
X

దిశ, సినిమా:ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’ షో ఇప్పటికే ఫస్ట్‌ సీజన్‌ను సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకుది. ఇక రెండో సీజన్‌ కూడా తుది దశకు చేరుకుంది. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహా మేనేజ్‌మెంట్‌ తాజాగా ఫినాలే ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్‌ చేసింది. ఇందులో సింగర్స్‌ పాటలకు ఫిదా అయిన బన్నీ వారిని అభినందించారు. మొదటగా సింగర్‌ శ్రుతి నండూరి పాడినా ‘ఇరగా.. ఇరగా’ పాటను మెచ్చుకున్న ఆయన ఆ సింగర్‌కు ‘AA’ పేరుతో కూడిన ఓ లాకెట్‌ను కానుకగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘ మీ పేరంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌ది కూడా అదే పేరు’ అని చెప్పి సిగ్గుపడిపోయాడు. ఇంతలోనే గీత మాదురి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే స్కూల్‌లో కాదు కదా అంటే.. దీనికి సమాధానంగా ‘చిన్నప్పుడైతే పేరు చెబుతూ ఇంత బ్లేష్ అవుతారా’ అని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

Next Story

Most Viewed