నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే ?

by velandi.Saikiran |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)... పుష్ప సినిమాతో (Pushpa 2) తన క్రేజ్ ను పెంచుకున్నాడు. పుష్ప, పుష్ప 2 రెండు సి

నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్.. ఇక ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)... పుష్ప సినిమాతో (Pushpa 2) తన క్రేజ్ ను పెంచుకున్నాడు. పుష్ప, పుష్ప 2 రెండు సినిమాలు బంపర్ హిట్ కావడంతో... ప్రపంచ స్థాయి హీరోగా మారిపోయారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత... అట్లీ కుమార్ (Atlee Kumar ) తో మరో కొత్త మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 800 కోట్లతో... ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.. ఈ మూవీలో అల్లు అర్జున్ మొత్తం నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఒకే సినిమాలో డబుల్ రోల్ చూసాం కానీ.. అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా నాలుగు పాత్రలలో కల్పించనున్నారట.

ఇందులో తాత, తండ్రి అలాగే ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు... ఇలా మొత్తం నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ మెరవబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా ఈ అప్డేట్ గురించి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ న్యూస్ వినగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేస్తున్నారు. ఒక్క పాత్రకే అల్లు అర్జున్ చింపేస్తే... ఇప్పుడు నాలుగు పాత్రలతో వస్తే... ఇండస్ట్రీ షేక్ అవడం పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నారని మొన్నటి వరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story