భార్య విషయంలో అందరిలాంటి మగాడే అనిపించుకున్న అల్లు అర్జున్..

by Bhoopathi Nagaiah |

స్టార్ హీరోల భార్యలు కూడా ఈ మధ్య కాలంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు.

భార్య విషయంలో అందరిలాంటి మగాడే అనిపించుకున్న అల్లు అర్జున్..
X

దిశ, సినిమా: స్టార్ హీరోల భార్యలు కూడా ఈ మధ్య కాలంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన భర్త, పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక అందం విషయానికి వస్తే హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ట్రెండ్‌కి తగ్గ లుక్‌లో ఫొటోషూట్స్ చేస్తూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తన శరీరాకృతి గురించి చెప్పాలంటే.. ఇద్దరు పిల్లలున్న తల్లిగా ఎక్కడా కనిపించదు. అంత మంచి పర్సనాలిటీని మెయింటెన్ చేస్తుంది. అయితే తాజాగా బన్ని, స్నేహకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్నేహా రెడ్డికి కూడా సినిమాల్లోకి రావాలని కోరిక ఉండేదట. ఇదే విషయాన్ని బన్ని దగ్గర చెప్పడంతో.. అలా చేయడానికి వీల్లేదని క్లారిటీ ఇచ్చేశాడట. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో నటి కావాలనే కోరికను చంపుకుందని తెలుస్తోంది.

Next Story