- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాకా’ స్టోరీ లీక్.. పగలు మనిషి, రాత్రి మృగంలా బన్నీ?
‘రాకా’ సినిమాలో పగలు మనిషి, రాత్రి మృగంలా బన్నీ మారుతాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారిన అల్లు అర్జున్, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే రాకా. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇటీవల అనౌన్స్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ రాకా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.
ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. పగలు మనిషిలా, రాత్రి మృగంలా అల్లు అర్జున్ మారిపోతాడని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ తో బేడియా వచ్చింది. ఈ సినిమా లాగానే రాకా ఉంటుందా? లేక కథలో ఏమైనా మార్పులు చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్ నటిస్తారని టాక్ నడుస్తోంది.






