వైష్ణవిని చూస్తే నాకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి.. ‘Baby’ సక్సెస్ మీట్‌లో బన్నీ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 10 |
వైష్ణవిని చూస్తే నాకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి.. ‘Baby’ సక్సెస్ మీట్‌లో బన్నీ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ‘బేబీ’ చిత్ర విజయంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా సినిమాకు సంబంధించి జరిగిన ప్రసంశ సమావేశంలో పాల్గొన్న ఆయన.. హీరోహీరోయిన్స్ సహా టీమ్ మొత్తం పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆడియన్స్ అందిస్తున్నారని, తన తరపున వారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ‘అమీర్‌పేటలో కుర్రాళ్లు ఎలా ఫీల్ అవుతారో.. మూవీ చూశాక నేను అలాగే ఫీల్ అయ్యాను. వైష్ణవిని చూశాక ఇక తెలుగు అమ్మాయిలకు టైమ్ వచ్చిందనిపించింది. వైష్ణవి ఉత్తమ నటిగా అవార్డు అందుకోవాలని ఆశిస్తున్నా’ అన్నాడు. అలాగే మామ మెగాస్టార్ చిరంజీవిపై తన ప్రేమను చాటుకున్న బన్నీ.. తన చివరి శ్వాస వరకు చిరంజీవిని ఆరాధిస్తూనే ఉంటానని చెప్పాడు. చివరగా ‘ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్పగాడి రూల్’ అంటూ ‘పుష్ప2’లోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more : disha newspaper

Movie News & Gossips



Next Story

Most Viewed