అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ సినిమా స్టోరీ లీక్.. మైండ్ బ్లాంక్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్

by Sujitha Rachapalli |

అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాను పండుగ సందర్భంగా ప్రకటించారు.

అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ సినిమా స్టోరీ లీక్.. మైండ్ బ్లాంక్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్
X

దిశ, సినిమా : అల్లు అర్జున్ - లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాను పండుగ సందర్భంగా ప్రకటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. #AA23గా తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. సూపర్ హీరో సబ్జెక్ట్‌తో లోకేశ్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో సైంటిస్ట్ అయిన అల్లు అర్జున్ ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోతాడు.. ఆ ప్లేస్‌లో ప్రోస్థెటిక్ హ్యాండ్ అమరుస్తాడు.. అయితే ఈ ఆర్టిఫిషియ్ హ్యాండ్‌కు సూపర్ పవర్స్ ఉంటాయని.. ఈ పవర్‌ను ఉపయోగించి క్రిమినల్స్‌ను ఏరిపారేస్తాడని టాక్. తమిళ పుస్తకం ‘ఇరుంబు కై మాయావి’ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సూపర్ హీరో ఫాంటసీని ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాసుకున్న డైరెక్టర్.. మాసివ్, హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్‌తో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Next Story