- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలయాళ దర్శకుడితో సినిమా చేయబోతున్న అల్లు అర్జున్.. హింట్ ఇవ్వడంతో అంతా షాక్!
ఇప్పటివరకు బన్నీతో ఒక్క సినిమా కూడా చేయని బసిల్ జోసెఫ్(Basil Joseph), ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దిశ, సినిమా: అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మార్చి 2న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు అల్లు అర్జున్(Allu Arjun) తనతో పని చేసిన డైరెక్టర్లందరినీ పిలిచారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మలయాళ స్టార్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్. ఇప్పటివరకు బన్నీతో ఒక్క సినిమా కూడా చేయని బసిల్ జోసెఫ్(Basil Joseph), ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా, అల్లు అర్జున్ స్వయంగా బసిల్ జోసెఫ్‌ను దగ్గరుండి స్టేజ్ మీదకు తీసుకెళ్లి ఫొటోలు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరు ఇంత క్లోజ్‌గా ఉండటం చూస్తుంటే.. గత కొంతకాలంగా వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందన్న వార్తలు నిజమే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ ఫొటోతో హింట్ ఇచ్చారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు అల్లు అర్జున్ అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేయడం తెలిసి షాక్ అవుతున్నారు. ఆల్రెడీ అట్లీ, లోకేష్ కనగరాజ్ లాంటి కోలీవుడ్ డైరెక్టర్లను లైన్‌లో పెట్టిన బన్నీ, ఇప్పుడు మలయాళ డైరెక్టర్‌తో కూడా జతకట్టడం విశేషం. కేరళలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అక్కడ 'మల్లు అర్జున్'గా పిలవబడే బన్నీ, ఇప్పుడు అదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన టాలెంటెడ్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్‌తో సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బహుశా ఇది ఒక సూపర్‌హీరో సబ్జెక్ట్ అయి ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతోంది.






