అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాల‌య్య సంద‌డి

by velandi.Saikiran |   (  Updated:2026-03-03 01:18:17  IST  )

అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.

అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాల‌య్య సంద‌డి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అంగరంగ వైభవంగా అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ జ‌రిగింది. మార్చి 6వ తేదీన వివాహ బంధంతో అల్లు శిరీష్, నయనిక ఒక్కటి కానుంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు రిసెప్షన్ వేడుక నిర్వహించింది అల్లు ఫ్యామిలీ. సోమ‌వారం రోజు రాత్రి జ‌రిగిన ఈ వేడుకకు పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగచైతన్య, నాని తదితర‌ హీరోలూ ప్ర‌త్యేక అహ్వానితులుగా వ‌చ్చారు. ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నిలిచారు. అలాగే.. తన తదుపరి సినిమా దర్శకుడు అట్లీని అందరికీ పరిచయం చేశారు బన్నీ. ఇక అల్లు అర్జున్ కుమారుడు అయాన్ చేసిన సంద‌డి మామూలుగా లేదు.

నందమూరి బాలకృష్ణ సందడి

అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌లో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పెళ్లి చేసుకోబోయే కొత్తం జంట కలకాలం బాగుండాలని ఆశీర్వదించారు బాలయ్య. అల్లు శిరీష్, నయనిక జంట‌తో స్పెష‌ల్ గా ఫోటో కూడా దిగారు. ఈ సందర్భంగా.. అల్లు అర్జున్‌తో కలిసి కాసేపు ముచ్చటించారు నటసింహం బాల‌య్య‌.

అల్లు శిరీష్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ కాబోయే భార్య పేరు నయనిక రెడ్డి. ఈమె హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. గత కొన్ని రోజులుగా నయనిక, అల్లు శిరీష్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక అక్టోబర్ 31వ తేదీ 2025లో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మార్చి ఆరవ తేదీన పెళ్లి కూడా జరగనుంది. ఇక అదే రోజున అల్లు అర్జున్, స్నేహ రెడ్డి మ్యారేజ్ డే కావడం విశేషం. అల్లు శిరీష్ పెళ్లి సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ ఈవెంట్ గా నిర్వహించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.





Next Story