- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదాస్పద సినిమాకు రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్.. వైరల్‌గా మారిన పోస్ట్
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ (Dhurandhar)బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ (Dhurandhar)బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. విమర్శలు, ప్రశంసలు అందుకుంటూ కలెక్షన్స్ పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా సినీ సెలబ్రిటీ నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది ఈసినిమాకు రివ్యూ ఇవ్వగా.. ఇప్పుడు ‘ధురంధర్’ మూవీపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)పోస్ట్ పెట్టాడు. అలాగే ఇందులో నటించిన వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో.. ‘‘ఇప్పుడే ‘ధురంధర్’ చూశాను అద్భుతంగా తెరకెక్కించారు.
ఇందులో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. అత్యుత్తమ సాంకేతిక అంశాలు, అమేజింగ్ సౌండ్‌ట్రాక్‌లు ఉన్నాయి. రణ్‌వీర్ తన నటనతో షోను దుమ్మురేపాడు. దర్శకుడు ఆదిత్యధర్ పూర్తి స్వాగ్‌తో ఒక ఏస్ ఫిల్మ్ మేకర్‌గా ఈ చిత్రాన్ని విజయవంతం చేశారు. మీరు తెరకెక్కించిన విధానం నాకు బాగా నచ్చింది. అందరూ వెళ్లి ‘ధురంధర్’చూడండి’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు ఇంతటి భారీ ప్రశంసలు లభించినప్పటికీ వివాదాస్పదంగా మారుతోంది. ఇందులో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కొన్ని సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని గల్ఫ్ దేశాలు ‘ధురంధర్’ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఆరు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. దీనివల్ల ఈ సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఇటీవల ఈ మూవీపై హృతిక్ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతా నచ్చినప్పటికీ రాజకీయా పరంగా ఉన్న సీన్లు నచ్చలేదని చెప్పడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించడంతో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన ప్రేక్షకుల్లో ‘ధురంధర్’ చూడాలనే ఆసక్తి నెలకొంది.






