పూజా హెగ్డేకు అల్లు అర్జున్ బంప‌ర్ ఆఫ‌ర్..కూలీ రేంజ్ లో సాంగ్ !

by velandi.Saikiran |   (  Updated:2025-10-22 08:16:24  IST  )

దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్, పూజా హెగ్డేలతో కలిసి స్పెషల్ సాంగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ న‌డుస్తో

పూజా హెగ్డేకు అల్లు అర్జున్ బంప‌ర్ ఆఫ‌ర్..కూలీ రేంజ్ లో సాంగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో "AA22xA6" అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు దర్శకుడు అట్లీ. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8, 2025న ఈ సినిమా ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రీకరణ పనులు ముంబైలో ప్రారంభించారు. ఈ సినిమాను రూ. 700 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లుగా టాక్‌. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్లుగా ఏకంగా ఆరు మందిని పెట్టినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందనలతో సహా మరో ఇద్దరిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డేతో స్పెషల్ సాంగ్ చేయించబోతున్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఈ చిన్నది కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడుకు విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు అట్లీ, హీరో అల్లు అర్జున్, పూజా హెగ్డేలతో కలిసి స్పెషల్ సాంగ్ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ న‌డుస్తోంది. దీనికోసం పూజా హెగ్డేను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఏకంగా పూజ హెగ్డేకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి స్పెషల్ సాంగ్ తీయబోతున్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. పూజ హెగ్డేతో ఐటమ్ సాంగ్ చేయిస్తే సినిమా మంచి సక్సెస్ అవుతుందని చిత్ర బృంద సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయంపైన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

READ MORE ...

శిరీష్‌కు కాబోయే భార్యను సైడ్ చేసేసిన అల్లు స్నేహ.. తెలివైనదే అంటున్న నెటిజన్లు

Next Story