రూ. 20 కోట్లు పెట్టి అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ కొనుక్కున్నాడు..?

by Disha Web Desk |
రూ. 20 కోట్లు పెట్టి అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ కొనుక్కున్నాడు..?
X

దిశ, సినిమా: తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడంతో తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. కానీ కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అల్లు అర్జున్ కంటే గొప్పగా నటించిన నటులు ఉన్నారు. వాళ్లకు ఇవ్వకుండా బన్నీకే అవార్డు ఇచ్చారు’ అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ‘అల్లు అర్జున్ ఈ అవార్డును రూ. 20కోట్లు ఖర్చుపెట్టి కొనుక్కున్నాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ వందల సినిమాల్లో నటించారు. వారికి ఈ అవార్డు లభించడం కష్టమా?’ అని కొంత మంది విషం కక్కుతున్నారు. దీంతో బన్నీ అభిమానులు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. ‘డబ్బుతో అవార్డులు కొనేలా ఉంటే బన్నీ ఈ 20 ఏళ్లలో ఎన్నో నేషనల్ అవార్డులు అందుకునేవాడు. టాలీవుడ్‌లో బన్నీ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోలు సైతం ఉన్నారు. వాళ్లు తలుచుకుంటే ఈ అవార్డు కోసం రూ. 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలరు’ అని గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

Read More: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ప్రశంసలతో ముంచెత్తిన పోసాని కృష్ణ మురళి



Next Story