- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్-అట్లీ సినిమాకు కోట్లలో ఖర్చు.. అసలు విషయాలు చెప్పేసిన బన్నీ వాసు
అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్-అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. AA22*A6 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల సినీ కార్మికులు సరైన వేతనాలు లభించడం లేదని సమ్మె చేయడంతో స్టార్ హీరోల సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఇందులో అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ సమ్మె వల్ల భారీ నష్టమే వాటిల్లింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘‘ముంబైలోనూ మా టీమ్ కొన్ని సందర్భాల్లో షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ప్రతి రోజు ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాము. కానీ షూటింగ్‌కు బ్రేక్స్ పడటంతో నష్టాన్ని కలిగించాయి. విదేశాల నుంచి వచ్చిన టెక్నీషియన్లకు పని లేకున్నా రోజువారీగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సన్ పిక్చర్స్ నిర్మి్స్తున్న ప్రాజెక్ట్ కావడంతో, వారితో నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. ఏదైనా సమాచారం బయటపెట్టాలంటే వారు అనుమతించాలి. అందుకే మేమంతా ఇప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.






