అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్.. గుండుతో ఊహించని షాకిచ్చిన ఐకాన్ స్టార్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ సెన్సేషన్ బన్నీ, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్.. గుండుతో ఊహించని షాకిచ్చిన ఐకాన్ స్టార్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. టాలీవుడ్ సెన్సేషన్ బన్నీ, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రానికి 'రాకా' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ విషయానికొస్తే.. అల్లు అర్జున్ లుక్ చూసి సినీ లోకం షాక్ అవుతోంది. గుండుతో , కళ్లకు కాటుక పెట్టుకుని, సీరియస్‌గా కెమెరా వైపు చూస్తున్న లుక్ చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. అంతేకాకుండా ఆయన నుదిటిపై వైకింగ్ ట్యాటూలను పోలిన గుర్తులు ఉన్నాయి. అలాగే నిన్నటి టీజర్‌లో చూపించిన జంతువు గోళ్లు ఈ పోస్టర్‌లో కూడా హైలెట్‌గా నిలిచాయి. అట్లీ ఈ సారి ఏదో పెద్ద విజువల్ వండర్‌నే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ‘రాకా’ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదొక ఊహకందని పీరియాడికల్ యాక్షన్ డ్రామా అనే చర్చ మొదలైంది.

ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది అత్యంత వైవిధ్యమైన, భయంకరమైన లుక్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కాగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా మేకింగ్ కోసం నిర్మాత కళానిధి మారన్, అల్లు అర్జున్, అట్లీ ఇప్పటికే లాస్ ఏంజిల్స్ వెళ్లి ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ (VFX) టీమ్‌ను కలిశారు. ఆ టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. "మేము ఇప్పటివరకు చదివిన స్క్రిప్టుల్లో ఇది చాలా ప్రత్యేకం" అని చెప్పడం సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. ఇక రణ్‌వీర్ సింగ్ కూడా ఈ మూవీ సెట్స్‌కు వెళ్లి, "భారతీయ సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక అద్భుతాన్ని అట్లీ సృష్టిస్తున్నాడు" అని ప్రశంసించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.

Next Story