అన్ని కోట్ల బడ్జేట్‌తో తెరకెక్కుతున్న అల్లు అర్జున్- అట్లీ సినిమా.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే(ట్వీట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-10 11:20:43  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో మన ముందుకు వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు.

అన్ని కోట్ల బడ్జేట్‌తో తెరకెక్కుతున్న అల్లు అర్జున్- అట్లీ సినిమా.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో మన ముందుకు వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా బన్నీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ విషయాన్ని సన్ పిక్చర్స్(Sun Pictures) వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘AA22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ క్వీన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్- అట్లీ- సన్ పిక్చర్స్ సినిమా దాదాపు రూ.800 కోట్ల బడ్జేట్‌తో తెరకెక్కనుందట. ఇందులో 175 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషన్, 125 కోట్లు అట్లీ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. మరో 250 కోట్లు కేవలం VFX కే ఖర్చు అవుతుందట. ఆ రేంజ్‌లో సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయని ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 200 కోట్లు సినిమా ప్రొడక్షన్‌కి, మిగిలింది వేరే ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌కి ఇవ్వనున్నట్టు సమాచారం. దీంతో అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ఈ రేంజ్ లో ఖర్చుపెడుతున్నారా అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మరి హాలీవుడ్ రేంజ్ లో తీసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Next Story