- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘విడుదల పార్ట్ 1’ చాలా గొప్ప సినిమా : అల్లు అరవింద్
దిశ, సినిమా:‘విడుదల పార్ట్ 1’ లాంటి గొప్ప సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మీడియాను కోరారు నిర్మాత అల్లు అరవింద్. క్లైమాక్స్‌లో ఎమోషన్‌కి కనెక్ట్ అయిన ప్రేక్షకులంతా కచ్చితంగా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారని ప్రశంసలు కురిపించాడు. ‘విడుదలై పార్ట్ 1’గా వచ్చిన తమిళ సినిమాను తెలుగులో ‘విడుదల పార్ట్1’ టైటిల్‌తో ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న చిత్ర దర్శకనిర్మాతలు ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు అల్లు అరవింద్‌కు ధన్యవాదాలు. ఇళయరాజా మంచి ట్యూన్స్ అందించారు. ఈ సినిమాను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అలాగే చాలా కష్టపడి తీసిన సినిమాలో తామ క్యారెక్టర్లలో ఒదిగిపోయామన్న హీరోహీరోయిన్లు సూరి, భవాని శ్రీ.. ఈ మూవీని బిగ్ హిట్ చేయాలని ఆడియన్స్‌ను కోరారు.
ఇవి కూడా చదవండి: బిచ్చగాడు-2 నుంచి ‘‘చెల్లి వినవే’’ సాంగ్ రిలీజ్..