మెగా ట్యాగ్‌ను బన్నీ అస్సలు ఇష్టపడటం లేదా?

by Disha Web |
మెగా ట్యాగ్‌ను బన్నీ అస్సలు ఇష్టపడటం లేదా?
X

దిశ, సినిమా : మెగా ట్యాగ్‌‌ను అల్లు అర్జున్ అస్సలు ఇష్టపడటం లేదని, తనే సొంతంగా ఓ బ్రాండ్‌ క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇక అల్లు, మెగా కుటుంబాల మధ్య ఇంటర్నల్‌గా ఏదో జరుగుతోందనే ప్రచారం కొద్దికాలంగా మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరిగ్గా చిరంజీవి పుట్టిన రోజున అమెరికాలో ఉన్న బన్నీ వేడుకకు అటెండ్ కాకపోవడం చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే.. చిరంజీవిపై అల్లు అర్జున్‌కున్న ఫీలింగ్స్ గురించి ఓపెన్‌గా చెప్పేశాడు అల్లు అరవింద్. ఈ కట్టె కాలే వరకు తాను చిరంజీవి అభిమానినే అంటూ బన్నీ ఎప్పుడూ చెప్పే విషయాన్ని గుర్తుచేశాడు. అలాగే చిరంజీవికి కూడా అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమని, కొడుకుతో సమానంగా చూసుకుంటాడని తెలిపాడు. అంతేకాదు చిన్నప్పటి నుంచి బన్నీ ఏం చేసినా చిరు తెగ ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు.

డైరెక్టర్ Puri Jagannath క్రియేటివ్ గా ఆలోచించడానికి ఏం చేస్తాడో తెలుసా..

Next Story

Most Viewed