- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్‌ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్న అల్లు అరవింద్.. షాకింగ్ కామెంట్స్ వైరల్.. కారణం అదేనా!
యంగ్ హీరోయిన్ నిహారిక(Niharika)హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నిహారిక(Niharika)హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే స్థాయి నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ భామ తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ‘పెరుసు’ చిత్రంతో వచ్చిన ఆమె హిట్ తన ఖాతాలో వేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిహారిక క్రేజీ బ్యూటీగా మారి తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మిత్ర మండలి’(MithraMandali). ఈ చిత్రంలో ప్రియదర్శి(Priyadarshi), రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా(Prasad Behara) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూవీ ద్వారా విజయేందర్ ఎస్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం ‘మిత్ర మండలి’ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అరవింద్ (Allu Aravind)షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నా దగ్గరకు డైరెక్టర్ చాలామంది అమ్మాయి ఫొటోలను తీసుకువచ్చాడు.
కానీ నాకు మాత్రం నిహారిక నచ్చింది. దీంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని చెప్పాను. నేను ఆమెను ఫేక్ అకౌంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ ఉంటాను. నిహారిక ఒక్కదాన్నే కాదు అందరినీ ఫాలో అయి వారు పెట్టే పోస్టులు చూస్తాను. అలా నిహారికవి కూడా చూశాను.ఈ అమ్మాయి చాలా ఫాస్ట్. అయితే మా ఐడీలతో అలా చేస్తే నెటిజన్లు చేసే కామెంట్లు, మాట్లాడే మాటలను వినలేము, చూడలేము. అంతా చాలా దరిద్రంగా పెడుతుంటారు. అందుకని అవి వదిలేసి నేను ఎవరో తెలియదు కానీ అందరినీ ఫాలో అయి చూస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






