ఫుల్ ఫామ్‌లో ఉన్న అల్లరోడు.. ‘నరేష్-65’ సినిమాకు ముహూర్తం ఫిక్స్..

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) రూట్ మార్చి విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు.

ఫుల్ ఫామ్‌లో ఉన్న అల్లరోడు.. ‘నరేష్-65’ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) రూట్ మార్చి విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మెహర్ తేజ్ (Mehar Tej)దర్శకత్వంలో ‘ఆల్కహాల్’ మూవీ చేస్తున్నాడు. 63వ చిత్రంగా రాబోతుండగా.. నిహారిక హీరోయిన్‌గా కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈక్రమంలో.. తాజాగా, అల్లరి నరేష్ మరో కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

ఆయన కెరీర్‌లో 65వ చిత్రంగా రాబోతుండగా.. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), హాస్య మూవీస్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆగస్టు 4వ తేదీన ఉదయం 8:30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘పురాణాలు, మాయాజాలం పిచ్చి కామెడీ కోసం సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

link

Next Story