అల్లరి నరేష్ 'ఉగ్రం'.. థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల

by Chukka Sudharani |   (  Updated:2023-10-10 16:47:40  IST  )

‘నాంది’ వంటి సెన్షేనల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’.

అల్లరి నరేష్ ఉగ్రం.. థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నాంది’ వంటి సెన్షేనల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోగా.. ‘ఉగ్రం’పై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు.

ట్రైలర్ ఆధారంగా ‘ఉగ్రం’ కథాంశం ఏంటంటే.. నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటం. అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్తులను పట్టుకోవడానికి మొగ్గుచూపుతాడు. ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా, ట్రైలర్ రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ట్రైలర్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, రివిటింగా ఉంది. కాగా.. ఈ చిత్రం వేసవి కానుకగా మే 5 న థియేటర్లలో సందడి చేయనుంది.

Next Story