అల్లరి నరేష్ ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ

by Disha Web Desk 6 |
అల్లరి నరేష్ ‘ఉగ్రం’ ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో అల్లరి నరేష్ కామెడీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మొదటిసారి తన ఉగ్రరూపం చూపించడానికి డైరెక్టర్ విజయ్ తెరకెక్కించిన ‘ఉగ్రం’ చిత్రంతో ఈరోజు (మే 5) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస్‌గా నటించి మొదటిసారి తన ఉగ్రరూపం చూపించేశాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌లో ప్రారంభించారు. యూకే, యూఎస్‌లో ‘ఉగ్రం’ చూసిన సినీ ప్రియులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

‘ఉగ్రం ఫస్ట్ హాఫ్ మిక్డ్స్ ఎమోషన్లతో కూడిన బీజీఎమ్, ఫైట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. అల్లరి నటనకు గూస్ బంప్స్ రావడం ఖాయమని’ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ‘అద్భుతమైన సినిమా తప్పక చూడండి. అల్లరి నరేష్ విశ్వరూపం ఉగ్రం అంతటా గూస్ బంప్స్’ అని మరో నెటిజన్ల తెలిపారు. విడుదలైన మొదటి షోతోనే ‘ఉగ్రం’ చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సారి అల్లరి నరేష్‌ హిట్ కొట్టినట్టేనని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.



Also Read...

గోపిచంద్ ‘రామబాణం’ పబ్లిక్ టాక్ హిట్టా ఫట్టా?

Next Story

Most Viewed