డిఫరెంట్ సబ్జెక్ట్ తో మన ముందుకు రాబోతున్న అల్లరి నరేష్?

by Disha Web Desk 10 |
డిఫరెంట్ సబ్జెక్ట్ తో మన ముందుకు రాబోతున్న అల్లరి నరేష్?
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు మంచి కామెడీ సినిమాలతో మనల్ని అలరించిన అల్లరి నరేష్ ప్రస్తుతం సీరియస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులతో మంచి మార్కులు వేపించుకున్నాడు. వీటిలో నాంది సినిమా హిట్ అయింది.. అదే సక్సెస్ తో ఆ డైరెక్టర్ తోనే మరో సినిమా ఉగ్రమ్ తీసాడు. ఈ సినిమా యవరేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులను లైనులో పెట్టినట్లు తెలుస్తుంది. ఇక అల్లరి నరేష్ చేస్తున్న సినిమాలని చూస్తున్న నెటిజెన్స్ .. అప్పుడు ఇప్పుడు ఒకే తప్పు చేస్తున్నావ్ అంటూ నరేష్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. హీరో అన్న తర్వాత అన్ని పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి కానీ ఒకే టైప్ ఆఫ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులకి చిరాకు తెప్పించకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తిక్ అనే ఒక కొత్త దర్శకుడితో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నట్టు టాక్ వచ్చింది. నిజానికి ఈ సినిమా వేరే హీరోతో చేయాలి కానీ ఆయనకు డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా నరేష్ వద్దకి వచ్చిందట. ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడో? లేదో చూడాల్సి ఉంది.

Read More: ఆ రోజే ఐశ్వర్య నడుము చూసి షాక్ అయ్యాను.. ఆమె జీన్స్ తొడిగి చూసుకుంటే..


Next Story