హీరోలందరూ ముసుగు దొంగలు.. విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 16 |
హీరోలందరూ ముసుగు దొంగలు.. విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన తోటి హీరోల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ''ఒసేయ్ రాములమ్మ' సినిమాతో నాకు స్టార్‌డమ్ వచ్చింది. దాన్ని వారు తట్టుకోలేకపోయారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది సపోర్ట్ చేయమని అందరినీ అడిగాను కానీ ఎవరు ముందుకు రాలేదు. నా బ్యాచ్ హీరోలంతా ముసుగు దొంగలు. అలాగే వారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌లో కనీసం 20 శాతం ప్రజల కోసం ఖర్చు చేసినా.. సినిమాల్లోనే కాదు బయట కూడా హీరో అనిపించుకునేవారు. కానీ అలాంటి వారు ఇప్పటికీ కనిపించలేదు' అని చెప్పుకొచ్చింది.

Also Read: పని మనిషితో విషం పెట్టించి చంపాలని చూశారు: Tanushree Dutta

Next Story

Most Viewed