Alia Bhatt: కోట్లు పెట్టి కొత్త ఇంటిని కొన్న అలియా భట్?

by Disha Web Desk 10 |
Alia Bhatt: కోట్లు పెట్టి కొత్త ఇంటిని కొన్న అలియా భట్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇటీవల బాంద్రాలోని ఖరీదైన పాలిహిల్ ప్రాంతాల్లో రూ.37 కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో 8 అంతస్తుల ఇంట్లో అలియా-రణ్‌బీర్ నివాసం ఉంటున్నారు. అయితే త్వరలో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటుచేసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్న అలియా.. తన ప్రొడక్షన్ హౌస్ పేరిట ఈ ఇంటిని కొనుగోలు చేసిందట. ఇందుకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ కోసం ఏకంగా రూ. 2.26 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అలాగే గతంలో కొనుగోలు చేసిన రూ. 8 కోట్ల విలువగల బంగ్లాను తన చెల్లెలుకు కానుకగా ఇచ్చిందట. ఇక కొత్త ఇంటి నిర్మాణం పూర్తైన తర్వాత.. అలియా-రణ్‌బీర్ పర్మినెంట్‌గా ఇందులోనే ఉండబోతున్నారట.

Also Read..

‘మంగళవారం’ సినిమా నగ్నంగా హీరోయిన్ పోస్టర్ విడుదల



Next Story

Most Viewed