- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురి కోసం అలియా భట్ కీలక నిర్ణయం.. ఇకపై హాస్యానికే ప్రాధాన్యత ఇస్తానంటూ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt), శార్వరి వాఘ్(Sharvari) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్ఫా’.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt), శార్వరి వాఘ్(Sharvari) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆల్ఫా’. శివ్ రావెల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మిణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా భట్ సినిమాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘‘నేను ఇప్పటివరకు నా కూతురు రాహా (Raha)ఎంజాయ్ చేసే సినిమాలు చేయలేదు. అందుకే ఇక నుంచి కామెడీ కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి నవ్వుకునేలా సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను. ఇక నుంచి కేవలం హాస్యానికే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా. తన కోసమే జానర్ మార్చుకుంటున్నా. విభిన్న పాత్రల కోసం ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను.
కానీ వాటిల్లో నటిస్తానా తప్పుకుంటానా అనేది ఇప్పుడే పూర్తిగా చెప్పలేను. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను. కామెడీ చిత్రాలతో వచ్చి నా కూతురితో పాటు మీ అందరినీ అలరిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈవిషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. రాజీ, గంగూబాయ్ కాఠియావాడి వంటి చిత్రాల్లో తన విశ్వరూపం చూపించి షాక్ ఇచ్చిన అలియా కామెడీ సినిమాలతో మెప్పించగలదా అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరైతే రిస్క్ తీసుకుంటున్నావని హెచ్చరిస్తున్నారు.






