ఇలాంటి ప్రశ్నలు మగాళ్లను ఎందుకు అడగరు? దానికి మేమే బాధ్యులమా

by Kodari Anjali |   (  Updated:2023-05-11 11:45:28  IST  )

కెరీర్ పీక్‌లో ఉన్నపుడు నటీమణులు బిడ్డను కనడంపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇలాంటి ప్రశ్నలు మగాళ్లను ఎందుకు అడగరు? దానికి మేమే బాధ్యులమా
X

దిశ, సినిమా: కెరీర్ పీక్‌లో ఉన్నపుడు నటీమణులు బిడ్డను కనడంపై అలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి చాలామంది ఆ దశలో పిల్లలను కనేందుకు చాలా ధైర్యం ఉండాలని తనతో చెప్పినట్లు గుర్తుచేసుకున్న నటి.. తానుమాత్రం ఎప్పుడూ అలా ఆలోచించలేదని చెప్పింది. అలాగే స్త్రీ-పురుషులు కలిసి తల్లిదండ్రులు అయినా మహిళలకే భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయని, కెరీర్ ఫామ్‌లో ఉన్నపుడు బిడ్డను కనడం సాహసోపేతమైన నిర్ణయమా? అని మగవాళ్లను ఎందుకు అడగరని ప్రశ్నించింది. ఏదీఏమైనప్పటికీ రహాకు జన్మనివ్వడం చాలా సహజమైన నిర్ణయంగానే జరిగిపోయిందని, తల్లి దశను చాలా సులభంగానే భావిస్తానని తెలిపింది. చివరగా నటిగా, తల్లిగా తాను ప్రతిరోజూ వందశాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది.

Also Read: చేపలు, రొయ్యలు అమ్మి ఈ స్థాయికి వచ్చాను.. అక్షయ్ భార్య


Next Story