Alia Bhatt: రాజమౌళి చెప్పిన ఆ మాట ఎప్పటికీ మరిచిపోలేను.. అలియా

by Disha Web Desk 10 |
Alia Bhatt: రాజమౌళి చెప్పిన ఆ మాట ఎప్పటికీ మరిచిపోలేను.. అలియా
X

దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై బాలీవుడ్ నటి అలియా భట్ ప్రశంసలు కురిపించింది. మొదటిసారి ‘బాహుబలి’ ప్రీమియర్‌లో రాజమౌళిని కలిశానని, ఆ సినిమా చూస్తున్నపుడే ఎప్పటికైనా జక్కన్న దర్శకత్వంలో పనిచేయాలనే కోరిక కలిగిందని చెప్పింది. అనుకున్నట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’తో తన కల నేరవేరిందన్న అలియా.. ‘ఆయన దగ్గర పనిచేయడమంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లే. చాలా విషయాలు నేర్చుకుంటాం. అతనొక మాస్టర్ స్టోరీ టెల్లర్. నాకు నటన పరంగా సలహాలు ఇవ్వమని అడిగినపుడు.. ‘ఏ పాత్ర పోషించినా దానిని పూర్తి ప్రేమతో చేయాలి. సినిమా ప్రేక్షకాదరణ పొందలేకపోయినా మనం చేసిన క్యారెక్టర్ అందరికీ గుర్తిండిపోయేలా నటించాలి’ అని చెప్పాడు. అతడి ప్రతిభను మాటల్లో వర్ణించడం కష్టమే’ అంటూ జక్కన్నను పొగిడేసింది.

Read more:

నాగచైతన్య జీవితం బాగుండాలనే సమంత చైకి విడాకులు ఇచ్చిందా?

Next Story

Most Viewed