Alia Bhatt:ఈ శరీరంతో ఎప్పుడూ సంతోషంగా లేను

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-24 11:44:33  IST  )

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ తన శరీర బరువు, అందంపై తనకున్న మక్కువను గుర్తుచేసుకుంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.. ప్రస్తుతం మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తోంది.. Latest Telugu News

Alia Bhatt:ఈ శరీరంతో ఎప్పుడూ సంతోషంగా లేను
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్ తన శరీర బరువు, అందంపై తనకున్న మక్కువను గుర్తుచేసుకుంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.. ప్రస్తుతం మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తోంది. ఇదే క్రమంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు, అసంతృప్తికి గురిచేసిన అంశాలను రీసెంట్‌ ఇంటరాక్షన్‌లో వెల్లడించింది. '17 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు నటిమణుల బాడీ ఎలా ఉండాలి? అందంగా ఎలా కనిపించాలి? అనే అంశాలపై నా చుట్టూ నిరంతర సంభాషణలు జరిగేవి. అవి విన్నపుడు కాస్త ఆందోళనకు గురయ్యేదాన్ని. ఎందుకంటే అప్పటికి నా శరీర బరువు తక్కువగా ఉండేది. దీంతో ఎలాగైనా గ్లామర్‌గా తయారవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇందుకోసం చాలా కష్టపడి ఎన్నో పనులు చేయాల్సి వచ్చింది. అయినా నా శరీరంతో ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా లేను. కానీ ఇప్పుడు అవేవీ లేకపోయినా ఉత్తమ స్థానంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా' అని ఆలియా ఫన్నీగా మాట్లాడింది.

Read More: అలాంటి సీన్లను ప్రజలు నాన్సెన్స్‌గా ఫీల్ అవుతారు : Kiara Advani

Next Story