మా సినిమాపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు: Alia Bhatt

by Disha Web Desk 6 |
మా సినిమాపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు: Alia Bhatt
X

దిశ, సినిమా: 'బ్రహ్మాస్త్ర' బాయ్‌కాట్ ఇష్యూపై అలియా భట్ స్పందించింది. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ మూవీని బహిష్కరించాలంటూ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లను ఉద్దేశిస్తూ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె.. అనవసరంగ రాద్ధాంతం చేస్తున్నారని వాపోయింది. ఈ మేరకు తన సినిమాలో ఎలాంటి నెగెటివిటీ చూపించలేదని, అంతా పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పింది. అలాగే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లు ఎక్కడా వినిపించలేదన్న నటి.. తాను బాయ్‌కాట్ గురించి పెద్దగా ఆలోచించట్లేదని, ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

అంతేకాదు గతంలోనూ తానెవరినీ టార్గెట్ చేసి కాంట్రవర్సీ కామెంట్స్ చేయలేదన్న అలియా.. కొంతమందికి స్టార్ కిడ్స్ సినిమాలు నచ్చవని, అలాంటి వాళ్లు ఎలాగైనా చూడరనే విషయం గురించి మాత్రమే చెప్పినట్లు గుర్తుచేసుకుంది. ఇక రణ్‌బీర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రల్లో కనిపించనున్న సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే.

Also Read : 'Brahmastra' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు.. మేకర్స్‌కు కోట్లలో నష్టం..


Next Story

Most Viewed