- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజం తెలుసుకుని మాట్లాడండి.. గుడ్డిగా వాదించొద్దు: నెటిజన్లపై అలియా ఫైర్
బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నెపోటిజం ఇష్యూపై స్టార్ కిడ్ అలియా భట్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నెపోటిజం ఇష్యూపై స్టార్ కిడ్ అలియా భట్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్ మొదట్లో ఎదురైన సంఘటనలను గుర్తుచేసుకుంది. ‘నాకు ఒక విషయం కొత్తలో సరిగా అర్థం కాలేదు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నా నా తండ్రి దర్శకుడు అయినందువల్లే నాకు సినిమా ఆఫర్స్ వచ్చాయని అందరూ అనుకునేవారు. ఏ ఆడిషన్ లేదా ఇంటర్వ్యూ వెళ్లినా నెపోటిజం టాపిక్ నడిచేది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలుగుతారని నేను అనుకోను. ఎందుకంటే కష్టపడి పనిచేసిన అనుభవంతోనే ఈ మాట చెబుతున్నా. అందరికంటే సులభంగా స్టార్ నటిని కావడానికి బంధుప్రీతి కారణం కాదు నా హార్డ్ వర్క్’ అని చెప్పింది. అలాగే ‘మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండటం వల్లే నేను నటిని కావాలనుకున్నా. ఇందులో నా పేరెంట్స్ ప్రమేయం లేదు. ఈ విషయాలు చాలామందికి తెలియవు’ అంటూ నెగెటీవ్ కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది అలియా.
- Tags
- alia bhatt






