IIFA పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న అలియా.. ఆమె తాత పరిస్థితి విషమం

by Malleboina Mahesh |

సినీ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే IIFA అవార్డుల ఫంక్షన్ ను హీరోయిన్ అలియా భట్ అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. గత కొంతకాలంగా అలియా తాత నరేంద్ర రజ్దాన్ ఆరోగ్యం బాగోలేదు.

IIFA పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న అలియా.. ఆమె తాత పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా భావించే IIFA అవార్డుల ఫంక్షన్ ను హీరోయిన్ అలియా భట్ అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. గత కొంతకాలంగా అలియా తాత నరేంద్ర రజ్దాన్ ఆరోగ్యం బాగోలేదు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్పించినట్లు తెలుస్తుంది. 95 ఏళ్ల ఉన్న అలియా తాత.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికి.. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో.. అలియా.. IIFA అవార్డుల ఫంక్షన్ పర్యటనను రద్దు చేసుకుని ఆస్పత్రి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తీవ్రరూపం దాల్చిందని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.

Next Story