అలియా భట్, రణబీర్ ఇల్లు ప్రత్యేకతలు.. దాని ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహా అనే కూతురు కూడా ఉంది.

అలియా భట్, రణబీర్ ఇల్లు ప్రత్యేకతలు.. దాని ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్(Ranbir Kapoor), అలియా భట్(Alia Bhatt) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహా అనే కూతురు కూడా ఉంది. అయితే ఇద్దరు ఇండస్ట్రీలో వరుస చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరించడంతో పాటు చేతినిండా సంపాదిస్తున్నారు. అలాగే తమ గారాలపట్టి రాహా బాగోగులు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ జంట ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముంబైలో ఓ అదిరిపోయే ఇల్లును కట్టుకున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఇంటి ధర ఏకంగా రూ. 350 కోట్ల ఖరీదు అని టాక్. ముంబైలోని సినీ ప్రముఖుల ఇళ్లల్లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన ఇల్లు అని సినీ వర్గాల సమాచారం. ఆరు అంతస్తుల బిల్డింగ్ చూడటానికి సంప్రదాయంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం లేటెస్ట్ ఫీచర్స్‌తో నిర్మించారట.

చిన్నపాటి భూకంపం వచ్చిన తట్టుకునేంత స్ట్రాంగ్‌గా దీన్ని కట్టారట. ఇక ఇంట్లో ఉన్న ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇంటికి వాటిని అద్దాలు ఇటలీ నుంచి తీసుకురాగా.. కిచెన్ సామాన్లు ఏకంగా నెదర్లాండ్స్ నుంచి స్పెషల్‌గా తెప్పించుకున్నారు. ఇందులో దాదాపు 15 కార్లు పార్క్ చేసే విధంగా స్థలాన్ని అందంగా సౌకర్యవంతంగా కూడా చేశారట. ఈ ఇంట్లో ఎవరి గది వారికి కాకుండా ఒక్కొక్కరికి ఒక ఫ్లోర్‌నే కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక ఫ్లోర్‌లో రణబీర్ తల్లి నీతూసింగ్, మరొక దాంట్లో అలియా కుటుంబం ఉండబోతున్నారట. ఇక ఒక ఫ్లోర్‌ను ప్రత్యేకంగా కథలు వినడానికి కేటాయించారట.

ఇక మిలిగినవి ఏవైనా పార్టీస్ నిర్వహించడానికి.. ఇంటి వచ్చిన గెస్టులకు ఉంచారట. టెర్రస్ గార్డెనింగ్ కోసం ఏసియా దేశాల నుంచి మొక్కలు తెప్పించి పెట్టారట. ఇక ఈ ఇంట్లో ప్రతి వస్తువును ఒక్కో దేశం నుంచి తెప్పించినట్లు సమాచారం. అన్నింటి విషయంలో అలియా ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కొత్త ఇంట్లో వినాయకుడి విగ్రహం కూడా పెట్టారట. ఇక దానిని రామమందిరంలో బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన వ్యక్తి అర్జున్ యోగిరాజ్ తయారు చేసినట్లు సమాచారం.

Next Story