Alia Bhatt Daughter Name:అలియా భట్, రణ్‌బీర్ కూతురికి ఏం పేరు పెట్టారంటే..?

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-25 03:51:55  IST  )

బాలీవుడ్ క్యూట్ కపుల్ అటియా భట్, రణ్‌‌బీర్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నవంబర్ 6న అలియా భట్ ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌లో ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. Latest Telugu News

Alia Bhatt Daughter Name:అలియా భట్, రణ్‌బీర్ కూతురికి ఏం పేరు పెట్టారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్యూట్ కపుల్ అటియా భట్, రణ్‌‌బీర్ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నవంబర్ 6న అలియా భట్ ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌లో ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట తమ కూతురుని చూసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. తాజాగా, అలియా భట్ తన కూతురు పేరును అనౌన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేసింది. యూనిసెఫ్ లోగోతో ఉన్న ఓ జెర్సీపై కూతురు పేరును 'రహా' అని ప్రింట్ చేసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. అంతే కాకుండా అలియా భట్, రణ్‌బీర్ కలిసి పాపను లాలిస్తున్న ఫొటోను కూడా పోస్ట్‌లో జత చేసింది. అయితే పాప మొహాన్ని మాత్రం కనిపించకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారు. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు కొట్టిన " మసూద "

Next Story