- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష కోసం అక్షయ్ కుమార్ సాహసం.. షోలో అలాంటి పని చేసిన స్టార్ హీరో
హై హీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని, ఒకవేళ మధ్యలో ఆగిపోతే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని పందెం కాసింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏం చేసినా అందులో ఒక వైవిధ్యం ఉంటుంది. తాజాగా ఆయన హోస్ట్ చేస్తున్న ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో అక్షయ్ కుమార్ హై హీల్స్ వేసుకుని డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఫినాలే ఎపిసోడ్‌కు హాజరైన గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అక్షయ్‌కు ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరింది. హై హీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని, ఒకవేళ మధ్యలో ఆగిపోతే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని పందెం కాసింది. ఒకవేళ అక్షయ్ గెలిస్తే ఆమె లక్ష ఇస్తానని చెప్పింది. దీనికి ఏమాత్రం వెనకాడని అక్షయ్, వెంటనే హై హీల్స్ ధరించి స్టేజీపైకి వచ్చారు.
కింద పడిపోతానని లేదా అందరూ నవ్వుతారని అస్సలు ఆలోచించకుండా, తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఒక్క నిమిషం పాటు విజయవంతంగా డ్యాన్స్ చేసి లక్ష రూపాయల పందెంలో గెలిచారు. ఇక హీల్స్ వేసుకోవడంపై ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సెల్యూట్ చేశారు. హై హీల్స్‌తో నడవడం, డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో తాను ధరించాకే అర్థమైందని అన్నారు. మహిళలు గ్రేట్ అని ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా.. సాహసమే చేశాడని అంతా అంటున్నారు. ఇక ఈ వేడుకలో ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ కూడా సందడి చేశారు. కేవలం బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపై కూడా అక్షయ్ కుమార్ జోరు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.






