ముగ్గురు హీరోల‌తో అదిరిపోయే సినిమా..!

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 17:27:28  IST  )

అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటితో దర్శకుడు చందూ మొండేటి ఓ సినిమా తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ నడుస్తోంది.

ముగ్గురు హీరోల‌తో అదిరిపోయే సినిమా..!
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు బంపర్ హిట్ అవుతున్నాయి. అలాగే డిఫరెంట్ కథాంశాలతో వచ్చిన సినిమాలు కూడా ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే మరో క్రేజీ కాంబో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్ని రోజులు అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటితో దర్శకుడు చందూ మొండేటి ఓ సినిమా తెర‌కెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ నడుస్తోంది.

ఉజ్జయిని బ్యాక్ డ్రాప్ లో రూపొందించే ఈ సినిమా హిస్టారికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కునున్న ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పురాణాలకు ముడి పెడుతూ ఇప్పటికే కార్తికేయ 2 సినిమా చేసిన చందూ మొండేటి.. ఇప్పుడు అదే తరహాలో మరో కథను ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో హీరోను కూడా అతిథి పాత్రలో తీసుకోబోతున్నట్లు సమాచారం. తమిళ స్టార్ హీరోను ఇందులో భాగం చేయబోతున్నారట. దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Read More..

హిట్ కోసం శ్రీవిష్ణు కామెడీ స్కెచ్.. డైరెక్టర్ ఎవరంటే?

Next Story