- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిట్ కోసం శ్రీవిష్ణు కామెడీ స్కెచ్.. డైరెక్టర్ ఎవరంటే?
‘రంగబలి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ బసమశెట్టి, ఇప్పుడు శ్రీవిష్ణుతో తన రెండో సినిమానచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘మృత్యుంజయ’, ‘విష్ణు విన్యాసం’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా, శ్రీవిష్ణు క్రేజ్ మాత్రం తగ్గలేదు. తన తదుపరి చిత్రం కోసం ఒక అదిరిపోయే కామెడీ స్క్రిప్ట్‌ను ఆయన సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాగశౌర్య హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ బసమశెట్టి, ఇప్పుడు శ్రీవిష్ణుతో తన రెండో సినిమానచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు గతంలో ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’ వంటి చిత్రాలతో తన కామెడీ టైమింగ్‌ను నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నారట శ్రీవిష్ణు. హిట్ కోసం కామెడీ బాట పట్టిన ఆయనకు ఈసారైనా హిట్ వస్తుందా? లేదా చూడాలి.






