మహనీయుల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించలేవ్.. అక్షయ్‌పై ట్రోలింగ్

by Disha Web Desk 13 |
మహనీయుల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించలేవ్.. అక్షయ్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా: అక్షయ్ కుమార్ నటిస్తున్న మరాఠీ పీరియడ్ డ్రామా 'వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్'. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా మహేష్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి అక్షయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు మహారాజ్ వలే దుస్తులు ధరించి, అతని దర్బార్ నుంచి కెమెరా వైపు నడుస్తూ కనిపించగా ప్రజలు 'జై భవానీ జై శివాజీ' అని నినాదాలు చేస్తున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు అక్షయ్. అయితే ఈ లుక్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వెండి తెరపై గ్రేట్ మరాఠా రాజు పాత్రను అక్షయ్ పోషించడాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేమంటున్నారు. అంతేకాదు 'ది గ్రేట్ మరాఠా కింగ్ పాత్రకు అతనికి సంబంధమే లేదు. ఇప్పటికే వివిధ చారిత్రక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడంలో ఈ కెనడియన్ విఫలమయ్యాడు. అక్షయ్ సామ్రాట్ పృథ్వీరాజ్ లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా నటించిన 'హౌస్‌ ఫుల్ 4'లో పోషించిన బాలా పాత్రనే జనాలు గుర్తుంచుకుంటారు' అంటూ దారుణంగా విమర్శిస్తున్నారు. ఇక వసీమ్ ఖురేషి నిర్మించిన ఈ చిత్రం మరాఠీ, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 2023 దీపావళికి విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

READ MORE

బ్రాడ్‌తో సెక్స్ సీన్‌.. మొత్తం విప్పి చూపించమని ఒత్తిడి చేశారు



Next Story