- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసు చాటుకున్న అక్షయ్ కుమార్.. నువ్వు దేవుడివి స్వామి అంటూ నెటిజన్ల ప్రశంసలు
ఇటీవల షూటింగ్ జరుగుతుండగా.. ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రముఖ స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో చనిపోయారు.

దిశ, సినిమా: ఇటీవల షూటింగ్ జరుగుతుండగా.. ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రముఖ స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో చనిపోయారు. పా. రంజిత్(Pa. Ranjit) డైరెక్షన్‌లో ఆర్య నటిస్తున్న మూవీ సెట్‌లో కారు బోల్తా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. చికిత్స కోసం రాజును చిత్రబృందం సమీపంలోని ఓ ఆస్పత్రికి కూడా తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆయన మరణించారు. ఇక ఈ సంఘటన చిత్రబృందం నిర్లక్ష్యం వల్లే జరిగిందని డైరెక్టర్ పా. రంజిత్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన మోహన రాజు(Mohana Raju) మరణవార్తను తెలుసుకున్న నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఈ విషయం తెలుసుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ఇండస్ట్రీలోని 650 మందికి స్టంట్ మ్యాన్‌లను తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించారు. ఇన్సూరెన్స్ పాలసీ ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉన్నట్లు తెలుస్తోంది. స్టంట్ మ్యాన్ సెట్‌లో బయట ఎక్కడైనా గాయపడితే రూ. 5 లక్షల వరము బీరా పొందవచ్చునట. ఇప్పటికే బాలీవుడ్ దాదాపు 650మంది 700 మంది స్టంట్‌మ్యాన్‌లు యాక్షన్ సిబ్బంది ఈ బీమా పరిధిలో ఉన్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆయన మంచి మనసుతో చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు అయితే నువ్వు దేవుడివి స్వామి కామెంట్లు పెడుతున్నారు. కాగా, అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘కేసరి చాప్టర్-2’ సినిమాతో హిట్ అందుకున్న ఆయన వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. కానీ దీని తర్వాత వచ్చిన హౌస్‌ఫుల్-5, కన్నప్ప పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు.






