ఆ లైసెన్స్ విషయంలో కొట్టుకున్న స్టార్ హీరోలు..!(వీడియో)

by Dishanational4 |
ఆ లైసెన్స్ విషయంలో కొట్టుకున్న స్టార్ హీరోలు..!(వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సెల్ఫీ'. ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలకానున్న చిత్రంనుంచి తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో అక్షయ్ కుమార్ 'సూపర్ స్టార్'గా కనిపించగా.. పోలీసు అధికారిగా నటించిన ఇమ్రాన్ అక్షయ్‌కు పెద్ద అభిమానిగా కనిపించాడు. కాగా ఇమ్రాన్ కుమారుడు తమ హీరోతో సెల్ఫీని దిగాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్షయ్ డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడం మొదలవుతుంది. అది తీవ్ర పరిణామాలకు దారితీయడంతో.. ఎలాగైనా వీఐపీలాగే లైసెన్స్ పొందుతానని అక్షయ్.. కామన్ మ్యాన్‌లాగే పత్రాలన్ని సమర్పించి తీసుకోవాలనే ఇమ్రాన్ ఒకరినొకరు సవాలు చేసుకునే సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అంతేకాదు కామెడీ, యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలున్న ట్రైలర్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకన్న అక్షయ్.. 'ఈ కథలో విలన్ ఎవరో నాకు తెలియదు. కానీ, హీరో మాత్రం 'సెల్ఫీ!' ఇప్పుడే.. సెల్ఫీ ట్రైలర్ చూడండి' అంటూ అభిమానులతో షేర్ చేసుకున్నాడు.


Next Story