Akshay Kumar: గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కంప్లీట్ చేసిన అక్షయ్

by Disha Web Desk 10 |
Akshay Kumar: గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కంప్లీట్ చేసిన అక్షయ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్‌ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీ షూటింగ్ గత నెల రోజులుగా UKలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా అక్షయ్ కుమార్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు మోకాలికి తీవ్రమైన గాయం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సీన్ కోసం మొత్తం రూ.15 కోట్లు ఖర్చు పెట్టారంట మేకర్స్. అయితే తన కారణంగా ఈ షూట్ అగి పోవోద్దని ఆలోచించిన అక్షయ్ కాలుకు తగిలిన దెబ్బను లెక్క చేయకుండా సీన్ కంప్లీట్ చేశాడట. దీనిపై స్పందించని స్టంట్ డైరెక్టర్ క్రెయిగ్ మాక్రే ‘అక్షయ్ ఎల్లప్పుడూ నిర్మాతకు అనుకూలమైన నటుడు. గాయపడిన మోకాలితో కూడా షూట్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అతను సినిమా కోసం చేయగలిగినదంతా చేస్తున్నాడు. మొత్తం ప్రొడక్షన్ యూనిట్‌తో పాటు అతని సహనటుడు టైగర్ ష్రాఫ్ కూడా అక్షయ్ పని పట్ల తనకున్న అంకిత భావాన్ని చూసి గర్వపడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed