Akhil's Agent Twitter Review :అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ హిట్టా, ఫట్టా.. ట్విట్టర్ రివ్యూ ఇదే!

by Dishanational2 |
Akhils Agent Twitter Review :అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ హిట్టా, ఫట్టా.. ట్విట్టర్ రివ్యూ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని అభిమానుల్లో ఆనందం మొదలైంది. అఖిల్ , సాక్షి వైద్య జంటగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఏజెంట్. ఈ మూవీ (ఏప్రిల్ 28) ఈరోజు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇందులో అఖిల్ ఫుల్ మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, నెటిజన్లు తమ రివ్యూలను ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. అయితే చాలా మంది అభిమానులు అఖిల్ ఏజెంట్ మూవీతో స్టార్ హీరో రేంజ్‌కు ఎదుగుతాడని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.కాగా, ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వస్తున్న ట్విట్టర్ రివ్యూ ప్రకారం ఏజెంట్ సినిమాతో అఖిల్ మళ్ళీ బోల్తాపడ్డాడని తెలుస్తోంది. అఖిల్ కి మరో డిజాస్టర్ తప్పదని అంటున్నారు ప్రేక్షకులు. ఇందులో అఖిల్ యాక్షన్ పరంగా మెప్పించాడు, కానీ నటనతో ఆకట్టుకోలేక పోయాడని, ఫస్ట్ పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ మరింత దారుణంగా ఉంది అంటూ చెబుతున్నారు. స్టోరీ చెత్తగా ఉందని.. కథనం చాలా స్లోగా సాగుతుందని.. వీ ఎఫ్ ఎక్స్ క్వాలిటీ లేదని సిల్లీ క్లైమాక్స్ అని చెబుతున్నారు. మొత్తానికైతే అఖిల్ మళ్ళీ బోల్తా పడ్డాడని చెప్పాలి.

Read more:

Agent: ఏజెంట్ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?

ఆ వీడియో లీక్ చేస్తానంటూ స్టార్ డైరెక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న రష్మిక..?



Next Story

Most Viewed