ఆ వీడియో లీక్ చేస్తానంటూ స్టార్ డైరెక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న రష్మిక..?

by Disha Web Desk 6 |
ఆ వీడియో లీక్ చేస్తానంటూ స్టార్ డైరెక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న రష్మిక..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని బాషల్లో నటిస్తూ ఫులల్ ఫాలోయింగ్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్ షోతో తెగ రచ్చ చేస్తుంది. అయితే రష్మిక, సుకుమార్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుందని సమాచారం.

పుష్ప-2 షెడ్యూల్ షూటింగ్ బిజీలో ఉండగా ఈ సినిమా సెట్స్‌లో షూట్ పూర్తయిన తర్వాత సుకుమార్ చిల్ అవుట్ అవుతున్న సమయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడట. తనతో వర్క్ చేసే హీరోయిన్స్‌పై సుకుమార్ పలు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో రష్మిక, సుకుమార్ మాటలను తన ఫోన్లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. తర్వాత సినిమాలో అవకాశం ఇస్తే ఆ వీడియో లీక్ చేయనని రష్మిక, సుకుమార్‌ను సరదాగా ఆటపట్టిస్తుందట. అంతేకాకుండా అవకాశం ఇవ్వకపోతే ఈ వీడియోను లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Next Story

Most Viewed