పెద్ద ప్లాన్ వేసిన అఖిల్.. ‘ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెబల్ స్టార్?

by Disha Web Desk 9 |
పెద్ద ప్లాన్ వేసిన అఖిల్.. ‘ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రెబల్ స్టార్?
X

దిశ, సినిమా: టాలీవుడ్ అప్ కమింగ్ పాన్‌ ఇండియా చిత్రల్లో ‘ఏజెంట్’ ఒకటి. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 28న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మునుపెన్నడూ చూడని కొత్త యాక్టింగ్‌తో అఖిల్ వస్తున్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు అంతా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్ అయితే హైదరాబాద్‌లో ఏప్రిల్ 23న జరగనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed