కింగ్ నాగార్జున 100వ చిత్రంలో అఖిల్?

by Disha Web Desk 7 |
కింగ్ నాగార్జున 100వ చిత్రంలో అఖిల్?
X

దిశ, సినిమా : కింగ్ నాగార్జున.. తను నటించబోయే 100వ చిత్రం కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచిపోయేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ఈ ప్రతిష్టాత్మక సినిమా బాధ్యతలు నాగ్ ఏ దర్శకునికి అప్పగించాడా? అని అభిమానులంతా సందిగ్ధంలో పడిపోయారు. అయితే ఈ వెయిటింగ్‌కు ఎట్టకేలకు తెరపడింది.

ఈ మూవీ కోసం నాగార్జున డైరెక్టర్ మోహన్ రాజాతో జతకడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ కూడా కీలక పాత్ర పోషిస్తిన్నట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ రాజా చిరంజీవితో 'గాడ్ ఫాదర్' తెరకెక్కిస్తుండగా.. అది పూర్తవగానే కింగ్ మూవీ పనులు మొదలెడతాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ మూవీ స్టోరీని ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా, ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ మలచాలంటే కాస్త సమయం పడుతుంది మరి.

Next Story