‘అఖండ’కు థమన్ మ్యూజిక్ ప్రాణం పోయలేదు.. సౌండ్ లేకుండా చూసినా అలాగే ఉంటుంది : Boyapati Srinivas

by Chukka Sudharani |   (  Updated:2023-10-07 13:48:25  IST  )

బాలకృష్ణ ‘అఖండ’కు థమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని.. సక్సెస్‌లో సగం క్రెడిట్స్ ఆయనకే దక్కుతాయని ప్రశంసలు కురిపించారు విమర్శకులు.

‘అఖండ’కు థమన్ మ్యూజిక్ ప్రాణం పోయలేదు.. సౌండ్ లేకుండా చూసినా అలాగే ఉంటుంది : Boyapati Srinivas
X

దిశ, సినిమా : బాలకృష్ణ ‘అఖండ’కు థమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని.. సక్సెస్‌లో సగం క్రెడిట్స్ ఆయనకే దక్కుతాయని ప్రశంసలు కురిపించారు విమర్శకులు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన దర్శకుడు బోయపాటి.. అంతలేదని సమాధానమిచ్చాడు. సౌండ్ లేకుండా చూసినా సేమ్ ఫీల్ ఉంటుందని.. దీనికి థమన్ కొత్తగా చేసిందేమీలేదని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజెన్స్.. ఇది దుర్మార్గమని, కనీస కృతజ్ఞత లేకుండా అలా ఎలా మాట్లాడుతాడని అంటున్నారు. గతంలో ‘లెజెండ్’ మూవీకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ను కూడా బోయపాటి ఇలాగే అవమానించాడని తిట్టిపోస్తున్నారు.

Next Story