- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 బంపర్ విక్టరీ...అమరావతిలో బాలయ్య భారీ స్కెచ్ !
అమరావతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 18 అంటే గురువారం రోజున ఈ అఖండ 2 సక్సెస్ మీట్

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా అఖండ 2 ( Akhanda2). డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ అఖండ 2, థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. హిందూ ధర్మం, ఆధ్యాత్మికం, శివుడి చుట్టూ తిరిగే కథ ఇందులో ఉండడంతో కుటుంబ సమేతంగా థియేటర్లకు సినిమా తిలకిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేయగా, 200 కోట్ల టార్గెట్ గా దూసుకువెళ్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 చిత్ర బృందం మరో భారీ ప్లాన్ చేసింది.
ఈ సినిమా సక్సెస్ మీట్ ను అమరావతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 18 అంటే గురువారం రోజున ఈ అఖండ 2 సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారట. దీనిపై ఇవాళ అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా సంయుక్త మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించగా, తమన్ మ్యూజిక్ వాయించాడు. ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సంగతి తెలిసిందే.






