- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘అఖండ-2’.. ఎందులో చూడొచ్చంటే?
‘అఖండ-2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Balakrishna)అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇటీవల థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అఖండ-2’ (Akhanda-2)డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైందని గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ..ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘అఖండ-2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
కాగా.. అఖండకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బోయపాటి దర్శకత్వం వహించారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాను.. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్, ivy ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీ అచంట, ఇషాన్ సక్సెనా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్(Samyuktha Menon), ఆది పినిశెట్టి, హర్షల్ మల్హోత్రా కీలక పాత్రలో నటించారు. వివాదాల మధ్య డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది.






