- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త సినిమా స్టార్ట్ చేసిన ఆకాష్ జగన్నాథ్.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్
by Mallepaka Hamsa |
యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘తల్వార్’.

X
దిశ, సినిమా: యంగ్ టాలెంటెడ్ హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘తల్వార్’. ఆగస్టు 19న హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దీనిని కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ తెరకెక్కిస్తుండగా.. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు.
హైదరాబాద్లో జరిగిన తల్వార్ సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతిథిలుగా పాల్గొన్నారు. రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ ఇచ్చాడు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Next Story






