66 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు సిద్ధమైన ఐశ్వర్య రాజేష్.. హిట్ కోసం కక్కుర్తి పడకంటున్న నెటిజన్లు!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-27 10:55:46  IST  )

66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య జోడీ కట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

66 ఏళ్ల హీరోతో రొమాన్స్‌కు సిద్ధమైన ఐశ్వర్య రాజేష్.. హిట్ కోసం కక్కుర్తి పడకంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, ‘లాటరీ కింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ‘మనం ఎంటర్‌ప్రైజెస్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటించబోతోందని, ఆమె త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు నేరుగా స్టార్ హీరో నాగార్జున సరసన ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.

అయితే, 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య జోడీ కట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏజ్ గ్యాప్ గురించి , హిట్ కోసం కక్కుర్తి పడకని విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం నాగార్జున సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది, అందుకే ఐశ్వర్య ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంది అని మద్దతు ఇస్తున్నారు. ఇక వరుస హిట్లతో జోరు మీదున్న నాగ్ సరసన నటిస్తే తన కెరీర్ మరో మెట్టు పైకి ఎదుగుతుందని ఐశ్వర్య భావిస్తోందట. ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. ఒకప్పుడు నాగార్జునతో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి టబు ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

Read More : నన్ను నేను పరిపూర్ణం చేసుకోవడానికి పురుషుడు అవసరం లేదు.. పుకార్లకు చెక్ పెట్టిన Malaika Arora

Next Story