- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ డాక్టర్‌తో ఐశ్వర్య రాయ్ ఎఫైర్! అందుకే అభిషేక్ బచ్చన్ విడాకులు? నెట్టింట దుమారం రేపుతున్న న్యూస్!
దిశ, సినిమా: బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉన్నదా అంటే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తే. వీరు ధూమ్ 2 సినిమాతో ప్రేమలో పడి జనవరి 14, 2007లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వీరికి ఒక పాప కూడా జన్మించింది. కానీ గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అంబానీ కొడుకు పెళ్లిలో కూడా ఇద్దరు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో వీరి విడాకుల వార్తలు మరింత జోరందుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి విడాకులకు కారణం ఐశ్వర్యరాయ్ ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉండటమేనని, ఆ డాక్టర్ వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? ఐశ్వర్య రాయ్‌కి ఆ డాక్టర్‌తో ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌కి చాలా క్లోజ్ అయిన జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్ ఉన్నారట. ఇక ఆ డాక్టర్‌తో చాలా రోజుల నుండి ఐశ్వర్యరాయ్ సన్నిహితంగా ఉంటుందట. పెళ్లయినా కూడా వారి మధ్య స్నేహం తెగిపోలేదట. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా ఆ డాక్టర్‌తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ విషయంలోనే ఐశ్వర్యరాయ్‌కి అభిషేక్ కి మధ్య గొడవలు వస్తున్నాయని.. అందుకే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి రావడం లేదని.. ఎడ మొహం పెడ మొహం పెట్టుకుంటూ దూరం దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ జంట విడాకుల విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.